నర్సారావుపేట, క్రైమ్ మిర్రర్: నరసరావుపేట పట్టణంలో గ్యాస్ సిలిండర్ దొంగ హల్చల్ సృష్టిస్తున్నాడు. అర్ధరాత్రి వేళల్లో హోటళ్లలోకి చొరబడి వంటగ్యాస్ సిలిండర్లను కాజేస్తున్న ఘటనలు వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల గ్యాస్ ధరలు పెరగడంతో పాటు బ్లాక్ మార్కెట్లో సిలిండర్లకు డిమాండ్ ఉండటమే ఈ దొంగతనాలకు కారణమై ఉండొచ్చని వ్యాపారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ము, బంగారం మాత్రమే కాదు.
గ్యాస్ సిలిండర్లు కూడా విలువైన వస్తువులేనని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయని వారు అంటున్నారు. రాత్రి వేళల్లో నిఘా పెంచి, దొంగను పట్టుకోవాలని వ్యాపారులు పోలీసులను కోరుతున్నారు.