విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్: విశాఖపట్నం మురళీ నగర్ మసీదు సెంటర్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై కత్తులతో దాడి జరిగింది. బాధితుడు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాత కక్షల నేపద్యంలో సాలిపేటకు చెందిన వరుణ్ ( 35 ) హత్య కు గురైయాడు.
నిందితులు పరారీలో వున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్ఆరు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.