
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా ప్రముఖ వ్యక్తులను కూడా మోసం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మధ్యతరగతి కుటుంబాలను, సినిమా ఇండస్ట్రీ వ్యక్తులను అలాగే రాజకీయ నాయకులను కూడా మోసం చేసిన సైబర్ నేరగాళ్ళు తాజాగా పోలీసులనే బురిడీ కొట్టించారు. సాధారణంగా ఇటువంటి మోసాలు చేసేటువంటి వారిని సైబర్ క్రైమ్ పోలీసులే పట్టుకోవడానికి అహర్నిశలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ సైబర్ క్రైమ్ పోలీసులే అత్యాశకు పోయి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనం టికెట్స్ కోసమని ఒక అధికారి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు కోల్పోయారు.
Read also : వచ్చే మార్చి నెలలోనే అల్లు శిరీష్ వివాహం..?
మరోవైపు మరో పోలీసు అధికారి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాలుడు లాభాలు వస్తాయి అని ఒక గ్రూపులో యాడ్ చేశారు. ఆ గ్రూపులో వివిధ ఇన్స్పెక్టర్లు ఏకంగా 39 లక్షల వరకు నష్టపోయారు అని సమాచారం. ఇదంతా కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆఫీసర్స్ ఇద్దరు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఈ మోసాల పట్ల పోలీసులే అతి నమ్మకం అలాగే అత్యాశ పడ్డారు కాబట్టే ఇలా జరిగింది అని ఇక్కడ దొంగల అతి తెలివి మాత్రం ఏమీ లేదు అని స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోకండి. ఈ మధ్యకాలంలో ఇలా ఎంతోమందిని నిత్యం పోలీస్ స్టేషన్లో వద్ద చూస్తూనే ఉన్నాం. ఇకనుంచి అయినా ఏదైనా డబ్బులు పెట్టుబడిగా పెట్టే చోట ఒకటికి రెండుసార్లు ఆలోచించే పెట్టుబడి పెట్టాలి అని లేదంటే సైబర్ మోసాలకు గురవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read also : తెలంగాణాలో నేటి ప్రధాన వార్త విశేషాలు..!





