Homeక్రైమ్దారుణం...సినిమా షూటింగ్ అంటూ.... యువ‌తిపై ఇద్ద‌రు యువ‌కుల అఘాయిత్యం...! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం

దారుణం…సినిమా షూటింగ్ అంటూ…. యువ‌తిపై ఇద్ద‌రు యువ‌కుల అఘాయిత్యం…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఇద్ద‌రు యువ‌కులు ఓ యువ‌తికి సినిమా షూటింగ్ అని ఆశ చూపి గ‌దికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు యువతులు నివసిస్తున్నారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిలో ఓ యువతికి సినిమా షూటింగ్ ఉందంటూ యువకుడు మాయమాటలు చెప్పి నమ్మించాడు. సినిమా షూటింగ్ అనడంతో నమ్మిన యువతి.. యువకుడితో కలిసి సికింద్రాబాద్‌కు వెళ్లింది. సికింద్రాబాద్‌లోని గదికి తీసుకెళ్లిన యువకుడు.. తన స్నేహితుడితో కలిసి యువతిపై రెండు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

నిందితులు ఈనెల 16న ర్యాపిడో బుక్ చేయించి తిరిగి యువతిని ఇంటికి పంపించేశారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో స్నేహితురాలు ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అక్కడ వైద్యులు ఏం జరిగిందని ప్రశ్నించగా.. లైంగిక దాడి జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు