హైదరాబాద్, క్రైమ్మిర్రర్: తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ టీవీ చానల్లో కత్తి వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్దంగా ఉన్నాయంటు పేర్కొంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ (DAC) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ ఓబీసీ కన్వీనర్ కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది. సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే పార్టీ రాజ్యాంగం ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: గబ్బిలం వాలింది… రెండు నెలల్లోనే ప్రాణాలు కోల్పోయిన బాలుడు! షాకింగ్ రేబీస్ కేసు
పార్టీ అంతర్గత సమస్యలు లేదా అసంతృప్తి ఉంటే వాటిని బహిరంగంగా కాకుండా పార్టీ వేదికలపై చర్చించాల్సిందని, మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించాయని నోటీసులో పేర్కొన్నారు.కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, పార్టీలో కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, బీసీ వర్గాలకు పార్టీ పదవులు, రాజకీయ అవకాశాల కల్పనలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలపై పార్టీకి పలువురు నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో క్రమశిక్షణ కమిటీ స్పందించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో జారీ చేసిన నోటీసులో, మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కత్తి వెంకటస్వామిని ఆదేశించారు.
Also Read:అటల్ టన్నెల్ సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం – కారులోకి దూసుకెళ్లిన వంతెన ఇనుప కడ్డీలు- ఒకరు మృతి