
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అని పరుగులు తీస్తున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా ప్రజలకు చేరువవుతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అని తహతహలాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు అలాగే మంత్రులకు కొన్ని హెచ్చరికలు చేశారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని.. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు గురించి పూర్తిగా ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు. తాజాగా మరో 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని గ్రామాలలో పెన్షన్లు మరియు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని మండిపడ్డారు. వెంటనే ఐ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలి అని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ, CMRF అలాగే వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పక పాల్గొనాలి అని ఆదేశించారు. అలాగే మరోవైపు పార్టీ నాయకులను మాత్రమే కాకుండా పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలను కూడా గుర్తించాలి అని సీఎం తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించినప్పుడు.. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి అని… లేదంటే మరోసారి ఎన్నికలు జరిగినప్పుడు మీ పనితీరు తెలిసిపోతుంది అని హెచ్చరించారు.
Read also : పుష్ప రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించిన పెద్ది వీడియో సాంగ్?
Read also : తెలంగాణలో వింత ఘటన.. పొలాల్లోకి దూసుకు వచ్చిన వందల కోళ్ళు.. ఎగబడ్డ జనం?





