
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విమర్శలు గుప్పించారు. గత మా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని పనులకు మీరు క్రెడిట్ తీసుకోవడం చాలా బాగుంది అయ్యా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అని చంద్రబాబు నాయుడు పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లను మేమే కట్టేసాం అంటూ మీరు గొప్పలు చెప్పుకోవడం చాలా బాగుంది అని.. ఇది చూస్తున్న ప్రజలు నవ్వుతారు అని జగన్ అన్నారు. ఏదైతేనేం.. మొత్తానికి మీ క్రెడిట్ చోరీ స్కీం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. మూడు లక్షల 92 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు.. కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదు. కానీ మొత్తం మేమే చేశామంటూ మా క్రెడిట్ ను మీరు దోచుకోవడం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది అంటూ పేర్కొన్నారు. లక్ష నలభై వేల ఇల్లు నా హయాంలోనే పూర్తయిన దశలో ఉన్నాయి అని రాసుకు వచ్చారు. మరో 82,000 ఇల్లకు స్లాబ్ వరకు మేము కట్టించినవే అని తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్ చేసినటువంటి ఈ ట్వీట్ పై తెలుగుదేశం పార్టీ అలాగే ఆ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సిందే.
Read also : CRIME: దావత్‌లో విషాదం.. గొంతులో మటన్ బొక్క ఇరుక్కుని వ్యక్తి మృతి
Read also : నిజ జీవితంలోనూ రష్మిక దేవతే… విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!





