Homeక్రైమ్శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబ్ బెదిరింపు....! ప్ర‌యాణీకుల ఆందోళ‌న‌...

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబ్ బెదిరింపు….! ప్ర‌యాణీకుల ఆందోళ‌న‌…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. విమానాశ్రయం టెర్మినల్‌లో బాంబు పెట్టినట్లు అగంతకులు మెయిల్ చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్ మెుత్తం ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబు బెదిరింపు విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మరోవైపు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్ వెంటనే తనిఖీలు చేపట్టింది. తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు లేదని నిర్ధారించింది. ఎవరో ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇటీవల దేశవ్యాప్తంగా పాఠశాలలు, విమానాశ్రయాలు, న్యాయస్థానాలు వంటి వాటికి తరచుగా ఇలాంటి ఈ-మెయిల్స్, కాల్స్ వస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు