
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియాకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో మూడవ వన్డే మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ తీసుకునే సమయంలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత వెంటనే వైద్య బృందం రావడం అతనిని వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. తాజాగా వైద్య పరీక్షల్లో శ్రేయస్ అయ్యర్ రిబ్స్ కాస్త రక్తస్రావం అయినట్లుగా తేలడంతో వారం రోజులపాటు అతను ఐసీయూలో చికిత్స పొందుతారు అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఈ న్యూస్ తెలుసుకున్న శ్రేయస్ అయ్యర్ అభిమానులు అలాగే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. దీంతో శ్రేయస్ అయ్యర్ తిరిగి కోలుకొని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చని సమాచారం.
Read also : సీఎం రేవంత్ కు మరో మంత్రి ఝలక్.. తలపట్టుకున్న హైకమాండ్
Read also : ఒక యజ్ఞం లా దూసుకుపోతున్న కోటి సంతకాల సేకరణ
Read also : రేవంత్ కు షాక్.. నవంబరు 3 నుంచి అన్ని కాలేజీలు బంద్





