Homeక్రీడలుధోని వల్లే యువరాజ్ కెరీర్ ముగిసింది.. ఖండించిన మాజీ చీఫ్!

ధోని వల్లే యువరాజ్ కెరీర్ ముగిసింది.. ఖండించిన మాజీ చీఫ్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారతదేశ క్రికెట్ చరిత్రలో ఎవరు సాధించలేని రికార్డ్ సృష్టించినటువంటి యువరాజ్ సింగ్ అప్పటిలోనే జాతీయ జట్టులో కీలకమైన ప్లేయర్గా గుర్తింపు పొందారు. కానీ ఆ తర్వాత ధోని కి వచ్చినంత అవకాశాలు,ఆదరణ కానీ యువరాజ్ సింగ్ కు రాలేదు. గత కొద్ది రోజుల క్రితం యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే నా కొడుకు యువరాజ్ సింగ్ క్రికెట్ కెరియర్ ముగిసింది అని ఆరోపణలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ తీవ్రంగా ఖండించారు. టోర్నమెంట్స్ ముందు సెలెక్టర్ల నిర్ణయాలను మార్చాలని ధోని ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదు అని స్పష్టం చేశారు. ఇక యువరాజ్ సింగ్ ను డ్రాప్ చేయమని ఒక్కసారి కూడా ధోని అడగలేదని తెలిపారు. కొడుకు కెరియర్ విషయంలో తండ్రి ఎమోషనల్ అవడంలో ఎటువంటి తప్పు లేదని కానీ ధోని లాంటి వ్యక్తిపై బ్లేమ్ చేయడం సరికాదు అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బీసీసీ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్అన్నారు. కాగా యువరాజ్ సింగ్ ఆరు బంతులలో ఆరు సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

LPG Shortage: అయోధ్య రామయ్యకు LPG ఎఫెక్ట్, ఆలయ అధికారుల కీలక నిర్ణయం!

డెలవరీ బాయ్స్‌కి స్నేహితుడి లాంటి బైక్.. ఫుల్ ట్యాంక్ చేస్తే 700 కి.మీ ప్రయాణం.. రూ.57,657కే

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు