హాలీవుడ్ విజనరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన ‘అవతార్’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి రుజువైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఈ సారి కథలో కొత్త మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. ఇప్పటివరకు పాండోరా గ్రహంలోని ప్రకృతి సోయగాలు, అడవులు, సముద్ర గర్భంలోని అద్భుతాలను చూపించిన ఈ సిరీస్, ఇప్పుడు మరింత గాఢమైన, చీకటి కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ‘యాష్ పీపుల్’ అనే కొత్త తెగ పరిచయం కథకు మరింత ఉత్కంఠను జోడిస్తోంది. ఈ తెగ స్వభావం, వారి జీవన విధానం, పాండోరా భవిష్యత్తుపై వారి ప్రభావం కథలో కీలకంగా నిలుస్తాయి.
సాంకేతికంగా కూడా ఈ సినిమా మరో మెట్టు ఎక్కింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, డీటైల్‌గా రూపొందించిన ప్రపంచం, భావోద్వేగాలతో కూడిన కథనం ప్రేక్షకులను పూర్తిగా కొత్త అనుభూతిలోకి తీసుకెళ్తాయి. యాక్షన్, డ్రామా, ఎమోషన్ అన్నీ కలిపిన ఈ చిత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.
ఇక ‘అవతార్’ ఫ్రాంచైజీకి ప్రత్యేకతైన ప్రకృతి-మానవ సంబంధాలపై సందేశం ఈ భాగంలో కూడా కొనసాగింది. అభివృద్ధి, ఆక్రమణ, సహజ సంపదల పరిరక్షణ వంటి అంశాలను కథలో మిళితం చేస్తూ దర్శకుడు మరోసారి తన ముద్ర వేసాడు. సారాంశంగా చెప్పాలంటే, ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కేవలం విజువల్ స్పెక్టకిల్ మాత్రమే కాదు… పాండోరాలో కొత్త చరిత్రకు నాంది పలికే అధ్యాయం. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ గ్రాండ్ విజువల్ జర్నీని ఆస్వాదించొచ్చు.
also read: పాస్‌పోర్ట్ పౌరసత్వ పత్రం కాదు – కేంద్రం స్పష్టీకరణ