న్యూఢిల్లీ, క్రైమ్‌మిర్ః వరుసుగా కొత్త వైరస్‌లతో కలకలం రేపుతోంది. ఇటీవల ఓ క్రూజ్ నౌకలో హంట వైరస్ వ్యాప్తి మరువక ముందే తాజాగా మరో కొత్త నోరో వైరస్‌కలకలం రేపింది. ఉత్తర ఐర్లాండ్ బెల్ఫాస్ట్ నుంచి స్పెయిన్కు వెళ్తున్న ‘యాంబిషన్’ అనే క్రూజ్ నౌకలో నోరోవైరస్ అనుమానిత లక్షణాలతో 90 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఫ్రాన్స్లోని బోర్డెక్స్లో నౌకను నిలిపివేశారు.
సుమారు 1,700 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బందిని నౌకలోనే క్వారంటైన్ చేశారు. ఇప్పటికే మరో 50 మందిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల ఎంవీ హొండియస్ నౌకలో హంటా వైరస్ కారణంగా ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ వైరస్ వ్యాప్తితో దీనికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.
నోరోవైరస్ను ‘వామిటింగ్ బగ్’ అని కూడా అంటారు. కలుషితమైన ఆహారం కారణంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. అన్ని వయసుల వారికీ ఇది సోకుతుంది. విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. అయితే, ఈ వైరస్ బాధితులు చాలామంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు.