Tuesday, February 24, 2026
Homeక్రైమ్యాంకర్ స్వేచ్ఛ నా భర్తను వేధించింది..మరో ట్విస్ట్

యాంకర్ స్వేచ్ఛ నా భర్తను వేధించింది..మరో ట్విస్ట్

తెలుగు న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చింది. తాజాగా ఆమె చేసిన కామెంట్లు సంతలనంగా మారాయి. స్వేచ్ఛపై సంచలన ఆరోపణలు చేశారు పూర్మ చందర్ భార్య స్వప్న. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తానేనని చెప్పింది.

స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న పూర్ణచందర్‌ను వెనకేసుకొస్తూ ఆయన భార్య స్వప్న మాట్లాడారు. తన భర్త ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందని, అయితే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తనకు మొదట తెలియదని ఆమె వివరించారు. వారి వ్యవహారం తెలిసిన తర్వాత తాను పూర్ణచందర్‌ను వదిలేశానని స్పష్టం చేశారు.

స్వేచ్ఛ తనను మానసికంగా తీవ్రంగా వేధించిందని స్వప్న ఆరోపించారు. పూర్ణచందర్‌ను స్వేచ్ఛ బ్లాక్‌మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా “అమ్మా” అని పిలవాలంటూ భయపెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచందర్ తో తాను దిగిన ఫోటోలను స్వేచ్ఛకు నాకు వాట్సాప్ చేసి వేధించేదని తెలిపారు. పూర్ణ తన దగ్గరకు రాకుంటే నాకు ఫోన్ చేసి తిట్టేదని స్వప్న వెల్లడించారు. స్వేచ్ఛ కూతురిని పూర్ణచందర్ చాలా బాగా చూసుకున్నారని.. నా పిల్లల కంటే ఎక్కువ ప్రేమ చూపించేవారని చెప్పింది. ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మాట్లాడుతున్న మాటలు చూస్తే.. ఆమెతో ఎవరో కావాలని మాట్లాడిస్తున్నారని స్వప్న తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments