
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ మరియు అజిత్ మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్అవుతుంది. అయితే తాజాగా ఈ విషయం పట్ల అజిత్ స్పందించారు. నాకు అలాగే విజయ్ మధ్య వైరం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అవన్నీ కూడా అబద్ధమని హీరో అజిత్ పేర్కొన్నారు. నాకు విజయ్ తో ఎటువంటి శత్రుత్వం, వాదాలు లేవు అని.. దయచేసి ఇటువంటి ప్రచారాలను ఆపివేయాలని సూచించారు. మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్న కారణంగా ఇద్దరి అభిమానులు తీవ్రస్థాయిలో గొడవలు పడుతున్నారు అని.. దయచేసి ఇలాంటి సమస్యలు సృష్టించేవారు మౌనంగా ఉండాలి అని కోరారు. నేను ఎప్పుడూ కూడా విజయ్ మంచినే కోరుకుంటాను అని.. దయచేసి ఫేక్ వార్తలు సృష్టించవద్దని తెలిపారు. మరోవైపు కరూర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు నాతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యులే అని అజిత్ ఇటీవల అన్నారు. ఇప్పటికైనా సినిమా స్టార్ల చుట్టూ తిరగడం మానుకోవాలి అని.. క్రికెట్ మ్యాచ్లకు ఎంతోమంది వెళుతుంటారు కానీ అక్కడ జరగని తొక్కిసలాటలు సినిమా స్టార్ల దగ్గరే ఎందుకు జరుగుతున్నాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మండిపడ్డారు.
Read also : వీధి కుక్కల సమస్యలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!
Read also : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం!





