Homeఆంధ్ర ప్రదేశ్కాబోయే అల్లుడికి ట్రాఫిక్ ఉల్లంఘనలా... నెట్టింట వైర‌ల్‌...!

కాబోయే అల్లుడికి ట్రాఫిక్ ఉల్లంఘనలా… నెట్టింట వైర‌ల్‌…!

కాకినాడ, క్రైమ్ మిర్ర‌ర్‌: ళ్లికాని అబ్బాయిలూ మీకో ముఖ్యమైన గమనిక.. మీకు పిల్లనివ్వబోయే మామ మీ ఉద్యోగం, ఆస్తి, అలవాట్ల గురించి మాత్రమే కాదు.. మీపై ట్రాఫిక్ చలానాలు ఉన్నాయో కూడా తెలుసుకుంటున్నారు. మీరు ఉంటున్నది నిజమే.. తాజాగా కాకినాడకు చెందిన ఓ వ్యక్తి తనకు కాబోయే అల్లుడి గురించి ఆరా తీస్తే.. అతడిపై ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా, లేదా కూడా ఆరా తీశారు. సాధారణం ఆడపిల్లకు పెళ్లి సంబంధాలు చూసే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్దవాళ్లు చెప్పినట్లుగా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల సంగతి పక్కన పెడితే.. అబ్బాయి గుణగణాలు, అలవాట్లు వంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తుంటారు. కొంతమంది అబ్బాయి జీతం ఎంత, ఆస్తి ఎంత అని కూడా ఆరా తీసేవాళ్లు ఉంటారు. తమ బిడ్డ భవిష్యత్ బావుండాలనే ఉద్దేశంతోనే అమ్మాయి తల్లిదండ్రులు ఇలా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. కానీ కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా కాదు.. తనకు కాబోయే అల్లుడి గురించి ఆరా తీసేందుకు.. విచిత్రంగా యువకుడు నడిపే బైక్‌, కారుపై ఏవైనా చలానాలు ఉన్నాయి అంటూ ఆరా తీశారు.

నేరుగా సీఐ దగ్గరకు వెళ్లి కాబోయే అల్లుడి గురించి అడిగి తెలుసుకున్నారు.కాకినాడలోని రాయుడుపాలేనికి చెందిన ఓ వ్యక్తి కూతురికి పెళ్లి చేద్దామని ఓ సంబంధం చూశారు. ఈ క్రమంలో తనకు కాబోయే అల్లుడి గురించి తెలుసుకోవాలనుకున్నారు. కాకపోతే ఆయన ఆ యువకుడి గుణగణాలు తెలుసుకోవడంతో పాటుగా కాస్త వినూత్నంగా ఆలోచించారు. తనకు కాబోయే అల్లుడు ట్రాఫిక్ నిబంధనలు ఎలా పాటిస్తున్నాడా.. వాహనాలు ఎలా నడుపుతున్నాడో తెలుసుకోవాలనుకున్నారు. రెండు రోజుల కిందట కాకినాడ భానుగుడి దగ్గర విధుల్లో ఉన్న ట్రాఫిక్‌-2 సీఐ డి రామారావును ఆయన కలిశారు. తనకు కాబోయే అల్లుడికి ఓ కారు, ఓ బైక్ ఉందని.. వాటి రిజిస్ట్రేషన్‌ నంబర్ల వివరాలు సీఐకి ఇచ్చారు. ఈ రెండు వాహనాలపై ఏమైనా చలానాలు ఉన్నాయేమో చెక్ చేయాలని కోరారు. ఒకవేళ ఈ వాహనాలపై చలానాలు ఉంటే కనుక తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయనని సీఐతో చెప్పారు. ఆయన చెప్పిన మాటతో సీఐ కూడా అవాక్కయ్యారు.సీఐ రామారావు వెంటనే స్పందించి.. ఇలా ఎందుకు చేస్తున్నారు, కాబోయే అల్లుడి వాహనాలపై చలానాల గురించి ఎందుకు ఆరా తీస్తున్నారని ఆయనను అడిగారు. తన భార్య చనిపోయిందని.. తనకు ఒక్కగానొక్క కుమార్తె ఉందన్నారు.

ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నానని.. ఆమెకు పెళ్లి చేసే సమయంలో, అన్నీ చూసుకోవాలి కదా అన్నారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఆ అబ్బాయి చేతిలో పెట్టాలని అనుకుంటున్నానన్నారు. ఇలా ఆ తండ్రి కూతురిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. తనకు కాబోయే అల్లుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా తాను భావిస్తానన్నారు. అప్పుడు తన కుమార్తెను బాగా చూసుకుంటాడని తనకు నమ్మకం ఉంటుందని సీఐ రామారావుతో చెప్పారు.వెంటనే సీఐ రామారావు కూడా చాలా పాజిటివ్‌గా స్పందించారు. ఆయన ఇచ్చిన రెండు నంబర్లతో చెక్ చేసి.. ఆ రెండు వాహనాలపై ఎలాంటి చలానాలూ లేవని చెప్పారు. దీంతో ఆయన చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్లారు. కూతురి భవిష్యత్ కోసం ఒక తండ్రిగా చాలా గొప్పగా ఆలోచించారని.. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే బావుటుందని సీఐ రామారావు అన్నారు. మొత్తం మీద కాకినాడకు చెందిన పెద్దాయన తన కూతురి భవిష్యత్ కోసం ఇంత దూరం ఆలోచించారా అంటూ చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు