
బాన్సువాడ, క్రైమ్ మిర్రర్ : రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యక్తి మృతిచెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….పాత బాన్సువాడకు చెందిన సందీప్(33) హైదరాబాదులోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.
శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.దీంతో అక్కడి కక్కడే సందీప్ మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు.మంచి వ్యక్తిని కోల్పోయామని కుటుంబీకులు,తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవి కూడా చదవండి ..
- రోడ్డు ప్రమాదంలో మహిళా దుర్మరణం..!
- కేసీఆర్ పై కేసు పెట్టిన వ్యక్తి దారుణ హత్య
- బర్డ్ ఫ్లూతో మనిషి మృతి.. చికెన్ తింటే మీరు అవుటే
- జగిత్యాల జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్!.. 11 వాహనాలు స్వాదీనం?
- ప్రైవేట్ వీడియోల ప్రశ్నలపై స్పందించిన హీరో నిఖిల్!..