Homeఆంధ్ర ప్రదేశ్లారీని ఢీకొట్టిన ప్రైవేటు బ‌స్సు...ఒక‌రు మృతి..!

లారీని ఢీకొట్టిన ప్రైవేటు బ‌స్సు…ఒక‌రు మృతి..!

నెల్లూర్‌, క్రైమ్ మిర్ర‌ర్: నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్ బ‌స్సు ఢీ కొట్టిన సంఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో విషాదం నెల‌కొంది. జిల్లాలోని పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు జాతీయ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని నాయుడు పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వివరించారు. బెంగళూరు నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ ఆదిలక్ష్మీ పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు