Homeతెలంగాణరామం మూవీ టీం బంప‌ర్ ఆఫ‌ర్‌...!ఔత్సాహిక న‌టీన‌టులకు ఆహ్వానం...!

రామం మూవీ టీం బంప‌ర్ ఆఫ‌ర్‌…!ఔత్సాహిక న‌టీన‌టులకు ఆహ్వానం…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: దోనేపూడి చక్రపాణి సమర్పణలో, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రామం”. ది రైజ్ ఆఫ్ అకిరా అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో “రామం” సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతూ మేకర్స్ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందాలని, నటీనటులుగా ప్రతిభ చాటాలని ఆశిస్తున్న అన్ని వయసుల వారు ఈ సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

Also Read:ప్రయాణంలో వాంతులు మాయం అవుతాయా? వైరల్ అవుతున్న ‘నాణెం చిట్కా’ నిజమేనా!

ఈ నెల 25, 26, 27, 28వ తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. మీ రీసెంట్ ఫొటో, బయోడేటా, ఒకటి రెండు నిమిషాల నిడివి గల మీ షార్ట్ ఇంట్రడక్షన్ వీడియోను 9949814280 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు లేదా [email protected] ఐడీకి మెయిల్ చేయవచ్చు. ఈ కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ పై ఇచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఔత్సాహిక నటీనటులు అప్లై చేసుకోవచ్చు.

Also Read:వాట్సాప్ ద్వారా విద్యా సేవలు – తెలంగాణలో డిజిటల్ ఎడ్యుకేషన్‌కు కొత్త దిశ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు