Homeఆంధ్ర ప్రదేశ్తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి

తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఓ భక్తుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. దర్శనానికి వెళ్లే క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనతో తిరుమలలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతానికి చెందిన వాయల్‌రాజ్ (55) శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చాడు. ఈ క్రమంలో రాంబగీచా బస్టాండ్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయనకు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు, తోటి భక్తులు వెంటనే స్పందించి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే వాయల్‌రాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అనంతరం ఆయన వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడిని తంజావూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ ఘటనపై అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎంతో భక్తితో స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన వ్యక్తి ఇలా అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తోటి భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమలలో ఈ ఘటన విషాదాన్ని నింపింది.

also read: తెలంగాణలో తొలి మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్.. ఇక ఫిర్యాదుల స్వీకరణ మరింత సులభం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు