Homeసినిమాసోషల్ మీడియా విమర్శలు పట్టించుకోను.. శోభిత నుంచి చాలా నేర్చుకున్నా: నాగచైతన్య

సోషల్ మీడియా విమర్శలు పట్టించుకోను.. శోభిత నుంచి చాలా నేర్చుకున్నా: నాగచైతన్య

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలు, భార్య శోభిత ధూళిపాళతో తన అనుబంధం, రాబోయే సినిమా విశేషాల గురించి మనసులోని మాటలను బయటపెట్టారు.

సోషల్ మీడియాలో తన గురించి ఎలాంటి చర్చలు జరిగినా వాటిని పెద్దగా పట్టించుకోనని నాగచైతన్య స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌లో వచ్చే విమర్శలకు స్పందిస్తూ సమయం వృథా చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అయితే తాను మౌనంగా ఉండటాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్‌లో ఏదీ శాశ్వతం కాదని, ఈరోజు ఒక విషయం గురించి చర్చ జరిగితే రేపటికి మరో అంశం తెరపైకి వస్తుందని పేర్కొన్నారు.

ఇక తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ భార్య శోభిత ధూళిపాళ తనపై ఎంతో ప్రభావం చూపించారని వెల్లడించారు. ఆమెతో కలిసి జీవితం పట్ల తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని, కొన్ని విషయాలను కొత్త కోణంలో చూడటం నేర్చుకున్నానని తెలిపారు. శోభిత నుంచి తాను ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

మరోవైపు తన తదుపరి చిత్రం ‘వృషకర్మ’ గురించి కూడా నాగచైతన్య ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని, ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొనగా, నాగచైతన్య వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

also read: 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు