Homeసినిమా20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు విభిన్నమైన కథాంశాలతో వినోదాన్ని అందించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ బోల్డ్ కామెడీ మూవీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

వైవాహిక జీవితంలోని విభిన్న కోణాలు, భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే మనస్పర్థలు, ఈగోలు, వివాహ బంధంలో ఎదురయ్యే మోసాలను కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆరు వేర్వేరు కథలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ సినిమా ప్రదర్శించిన అంశాలు చర్చనీయాంశంగా మారడంతో పాటు విమర్శలు, వివాదాలకు కూడా కారణమయ్యాయి.

విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా గురించి ఇప్పటికీ సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈవీవీ తనదైన శైలిలో తెరకెక్కించిన కథనం, బోల్డ్ కామెడీ ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో మరోసారి వెండితెరపైకి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అప్పట్లో ఈ చిత్రాన్ని చూసినవారితో పాటు కొత్త తరం ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

also read: ఆస్కార్ బరిలో ‘రామాయణ’.. టాప్‌-20లో చోటు దక్కించుకున్న భారతీయ చిత్రం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు