Homeతెలంగాణకాకినాడలో హోరాహోరి...!

కాకినాడలో హోరాహోరి…!

  • రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరాటం

  • కూటమి వైపే ఎడ్జ్

  • క్రైమ్ మిర్రర్ గ్రౌండ్ రిపోర్ట్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కాకినాడ కార్పొరేషన్ పై ఉంది. విలీన పంచాయితీల వివాదం కొలిక్కి రావడంతో 48 నుంచి 66 డివిజన్లకు విస్తరించింది ఈ కార్పొరేషన్. సుమారు రెండు లక్షల 85 వేల మంది ఓటర్లు మేయర్ పీఠాన్ని నిర్ణయించనున్నారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ మేయర్ స్థానం కోసం ప్రధానంగా ఎన్డీఏ కూటమి తరుపున జనసేన అభ్యర్థిగా ఆకుల భవాని ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాదా సత్య శ్రీ బరిలో నిలిచారు. కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలోనే 57 డివిజన్లో ఉండడంతో ఇక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా మారాయి.

ప్రముఖ వైద్య కుటుంబం…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సత్య శ్రీ నగరంలో ప్రముఖ వైద్యులు, సత్య స్కాన్ అధినేత డాక్టర్ కాదా వెంకట్ రమణ సతీమణి. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఈమెకు నగరంలో వైద్యుల కుటుంబంగా ఉన్న మంచి పేరు, వివాద రహిత ఇమేజ్ కలిసి వచ్చే అంశం. ఎన్నికల ముందే పార్టీలో చేరి నేరుగా బరిలోకి దిగడంతో క్షేత్రస్థాయి క్యాడర్ తో సమన్వయం చేసుకోవడం ఆమెకు కొంత సవాల్ గా మారింది. కూటమి అభ్యర్థి ఆకుల భవాని జనసేన నేత ఆకుల ప్రవీణ్ సతీమణి. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఆ వర్గంలో ఉన్న బలమైన పట్టు, పోర్టు సంబంధిత వ్యాపార నేపథ్యం కలిసి వచ్చే అంశాలు. టికెట్ కేటాయింపు సమయంలో జనసేన లో ఆరుగురు ఆశావహులు పోటీ పడడం, ప్రవీణ్ పై గతంలో వచ్చిన కొన్ని ఆరోపణలను విపక్షాలు ప్రస్తావించడం వంటి అంశాలను అధిగమించేందుకు ఓటమినేత్తులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

కాపులే అధికం…

కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 2.85 లక్షల ఓటర్లలో కాపులు సుమారు 67 వేలు, మత్స్యకారులు 51 వేలు, శెట్టిబలిజ సామాజిక వర్గం 31 వేల వరకు ఉన్నారు. జనసేనకు కంచుకోట లాంటి కాపు ఓటు బ్యాంకు తో పాటు అభ్యర్థి సామాజిక వర్గమైన మత్స్యకార ఓట్లు గుంపు గుత్తగా పడితే కూటమికి భారీ ఆధిక్యం లభించడం ఖాయం. దీనికి టిడిపికి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు, ప్రస్తుతం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బలం తోడు కానుంది. ఇంకోవైపు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న ఆర్థిక, అంగ బలం, శెట్టి బలిజ, మైనారిటీ, దళిత ఓటు బ్యాంకు వైసీపీకి అండగా నిలవనున్నాయి.

ప్రచారంలో ముందంజ…

ప్రచార పర్వంలో కూటమి ముందు వరుసలో ఉంది. మరోవైపు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు టిడిపి అగ్రనేతలపై ద్వారంపూడి హాట్ కామెంట్స్ చేసేవారు. దానిని గట్టిగానే తిప్పి కొట్టాలని కూటమి నేతలు వ్యూహంతో పని చేస్తున్నారు. జనసేన తరఫున ఎమ్మెల్సీ నాగబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా.. మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పదిమంది సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో మోహరించింది. టిడిపి సైతం ఈ సీటు తమది అన్నట్టు భావించి సామాజిక వర్గాల వారీగా మంత్రులను, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబులను రంగంలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్ని తానై వ్యవహరిస్తూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శాయశక్తులా శ్రమిస్తున్నారు. మొత్తంగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఓటర్ల నాడిని విశ్లేషిస్తే ప్రస్తుత సమీకరణల్లో ఎంబీఏ కూటమి అభ్యర్థి ఆకుల భవాని ప్రవీణ్ కె స్పష్టమైన ఎడ్జ్ కనిపిస్తోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  నిత్యావసరాల ధరలకు కళ్లెం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
  2. ఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తాడు.. ఈ సారి రూ.40 కోట్లు పక్కా
  3.  చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: హీరో నిఖిల్
  4.  యువతకు 66 శాతం సీట్లు.. ఉగాది నుంచి పాదయాత్రకు సిద్ధం: విజయసాయిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు