Homeతెలంగాణబిస్లరీ' వెనుక కథ ఇది...!

బిస్లరీ’ వెనుక కథ ఇది…!

  • పూర్తిగా క్లారిటీ ఇచ్చిన ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్

  • 14 నెలల కిందట ఘటన అంటూ స్పష్టత

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : బిస్లరీ.. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ లో అగ్రగామి సంస్థగా కొనసాగుతూ వస్తోంది. నాణ్యత పరీక్షల్లో విఫలమైందనే కారణంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విచారణకు అనుమతించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా స్పందించింది. ఈ వివాదం సుమారు 14 నెలల కిందట నాటిదని.. 2025 సెప్టెంబర్ లో గోవాలోని తమ తయారీ ప్లాంట్లో ఉత్పత్తి అయిన ఒక బ్యాచ్కు సంబంధించినదని సంస్థ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తమకున్న 143 ప్లాంట్లలో గోవా ప్లాంట్ ఒకటి పేర్కొన్న బిస్లరీ.. 2025 సెప్టెంబర్ 30న ఎఫ్ఎస్ఎస్ ఏఐ అధికారులు ఈ ప్లాంట్ నుంచి ఆరు నమూనాలు సేకరించారని వెల్లడించింది. ప్రాథమిక పరీక్షల్లో ఐదు నమూనాలు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని.. ఆరో నమూనాలో మాత్రమే లీటర్కు పది మైక్రో గ్రాముల పరిమితికి బదులుగా.. 12 మైక్రో గ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు నమోదయిందని వివరించింది. దీనిపై తాము 2025 నవంబర్లో అప్పీల్ చేయడంతో ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ ఆ నవ్వు నాను రీ టెస్టింగ్ కోసం రిఫరల్ లేబరేటరీ పంపించిందని బిస్లరీ తెలిపింది.

పరిమితికి లోబడే బ్రో మేట్…

అయితే రీ టెస్టులో లాక్ పరీక్షల్లో బ్రోమేట్ ఆ నీటిలో స్థాయి పరిమితికి లోబడే ఉన్నట్లు తేలింది. కానీ అందులో పాళీ న్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రో కార్బన్స్ ఉన్నట్లు విడిగా పేర్కొన్నారని సంస్థ వెల్లడించింది. రెండు పరీక్ష ఫలితాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం పై స్పష్టత కోసం కామస్ స్వతంత్రంగా ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ గుర్తింపు పొందిన మరో లేబరేటరీలో అదే నమూనాను పరీక్షించగా.. అందులోనూ బ్రో మేట్ స్థాయిలు నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్లు నిర్ధారణ జరిగినట్లు బిస్లరీ పేర్కొంది. స్వతంత్ర ల్యాబ్ పరీక్ష ఫలితాలను జతచేస్తూ 2026 ఫిబ్రవరి 2న ఎఫ్ ఎస్ ఏ ఐ వెస్ట్రన్ రీజనల్ ఆఫీసుకు అధికారిక లేఖ సమర్పించామని.. ఆ తరువాత తమకు ఎటువంటి సమాచారం అందలేదని బిస్లరీ స్పష్టం చేసింది. అక్కడితో అది ముగిసిన అధ్యయనమని పాము భావించినట్లు తెలిపింది.

ప్రమాణాలకు అనుగుణంగా…

కానీ ఇప్పుడు ఉన్నఫలంగా తమ సంస్థ పై దుష్ప్రచారం జరగడంపై ఆవేదన వ్యక్తం చేసింది బిస్లరీ. తాగునీటి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని.. తమ పది దశల తయారీ ప్రక్రియలు 90కి పైగా కఠినమైన నాణ్యత పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐకి పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.. దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని చూడకున్న బ్రాండ్ గా బిస్లరీ నీరు తాగడానికి పూర్తి సురక్షితమని ఆ సంస్థ తన ప్రకటనలు పూర్తిగా భరోసా ఇచ్చింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
  2. ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
  3. ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
  4.  తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు