-
జయలలితతో పోల్చుతూ పోస్టర్లు
-
ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటూ నినాదాలు
-
ఖండించకపోవడంతో నిజమే అన్న అనుమానాలు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో దివంగత జయలలిత ది ప్రత్యేక స్థానం. భారత రాజకీయాలను తన వైపు చూసుకునేలా చేశారు. గొప్ప ప్రభావం చూపారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి అప్రతిహస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె వారసురాలు అంటూ నటి త్రిష పేరు తమిళనాడు రాజకీయాల్లో మార్మోగిపోతోంది. తాజాగా త్రిష పేరుతో ఆమె మద్దతుదారులు, అభిమానులు కలిసి ఇళయ పురచ్చి తలైవి త్రిష పెరవై పేరుతో ఒక సంస్థను అధికారికంగా ప్రారంభించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితను అభిమానులు పురచ్చి తలైవి అని పిలుచుకునేవారు. ఇప్పుడు త్రిష కు అదే బిరుదులు తగిలించడమే కాకుండా.. జయలలిత అసలైన రాజకీయ వారసురాలు త్రిష అని అభిమానులు ముమ్మరంగా ప్రచారం ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు…
ఈ సందర్భంగా త్రిష భారీ పోస్టర్లు ఎక్కడికక్కడే వెలుగు చూస్తున్నాయి. త్రిష నమస్కారం పెడుతూ అచ్చం రాజకీయ నేతల ఫోజు ఇచ్చిన ఫోటోలతో కూడిన పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. త్రిషను ప్రజా జీవితంలోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడమే ఈ ఫారం ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం అని నిర్వాహకులు చెబుతున్నారు. జయలలిత వారసురాలిగా త్రిష రాజకీయాల్లోకి రావాలని.. విజయ్ తో కలిసి ఆమె రాజకీయ ప్రయాణం చేయాలని ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. త్వరలో తమిళనాడులో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి త్రిష పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలోనే ఈ సంస్థ పుట్టుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొంతకాలంగా ఇదే తంతు…
అయితే గత కొంతకాలంగా త్రిష పేరుతో రాజకీయం నడుస్తూనే ఉంది. ఆమె పేరుతో రాజకీయపరమైన పోస్టర్లు వెలుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో త్రిష అభిమానుల పేరుతో ఇలాంటి రాజకీయ పోస్టర్లు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. అయితే తన పేరును రాజకీయాలకు వాడుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎక్కడ ఖండించలేదు త్రిష. సాధారణంగా తమ పేరుతో అవాస్తవ ప్రచారాలు జరిగితే సెలెబ్రిటీలు వెంటనే ఖండన ఇస్తుంటారు. కానీ ఈ విషయంలో త్రిష పూర్తిగా మౌనం వహిస్తున్నారు. ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ఆమె గతంలో తన మనోగతాన్ని వెల్లడించారు. దానిని గుర్తు చేసుకుంటూ జయలలితతో ఎక్కువమంది పోలిక పెడుతున్నారు.
ఇవి కూడ చదవండి:
-
తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
-
ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
-
ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
-
తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు
