Homeతెలంగాణరేరా కొరడా...! 8 రియల్ ఎస్టేట్ కంపెనీలకు భారీ జరిమాన...

రేరా కొరడా…! 8 రియల్ ఎస్టేట్ కంపెనీలకు భారీ జరిమాన…

  • నిబంధనలు ఉల్లంఘించడంతో చర్యలకు ఉపక్రమణ

  • సరిదిద్దుకోకపోతే మరింత సీరియస్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరంలో స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం, చట్టబద్ధమైన అనుమతులు తీసుకోకపోవడం, ఒప్పందం ప్రకారం ప్లాట్లు అప్పగించకపోవడం, కొనుగోలుదారుల సొమ్మును తిరిగి చెల్లించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన ఎనిమిది మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లపై తెలంగాణ రేరా కఠిన చర్యలకు ఉపక్రమించింది. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజా చర్యలు ఇవే…

రేరా చర్యల్లో భాగంగా చట్టం -2016 లోని సెక్షన్ 3, నాలుగు నిబంధనలను ఉల్లంఘించిన సనాలి ఐటి పార్క్స్ సంస్థ పై టీజీ రేరా ఏకంగా 25 లక్షల భారీ జరిమానా విధించింది. 30 రోజుల్లో గా ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించడంతోపాటు కీలక నిబంధనలను పెట్టింది. పూర్తిగా క్రయవిక్రయాలు తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. రేరా రిజిస్ట్రేషన్ పొందే వరకు మంచిరేవులలోని తమ అనాధికారిక ప్రాజెక్టు సనాలీ ది ఎడ్జ్ కు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్ లు, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. మిగిలిన ఏడు సంస్థల విషయంలోనూ కొనుగోలుదారులకు పూర్తి ఊరట ఇచ్చింది. వారు చెల్లించిన మొత్తాన్ని వర్తించే వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని లేదా ప్లాట్లను అప్పగించాలని.

చెల్లింపులపై ఆదేశాలు…

శ్రీ ఆదిత్య స్క్వేర్స్.. నిర్మాణ జాప్యం కారణంగా కొనుగోలుదారుడు బుకింగ్ రద్దు చేసుకున్నప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అందుకే 17 లక్షలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. త్రిపుర కన్స్ట్రక్షన్స్ చట్టబద్ధమైన అనుమతులు పొందకుండా.. నిర్మాణం ప్రారంభించకుండా ప్లాట్లు అప్పగించడంలో విఫలమైనందుకుగాను రూ.41.85 లక్షల మందితో తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. వాసవి రియాల్టర్స్ ఎల్ఎల్పి ప్రాజెక్టు జాప్యం కారణంగా… 2025 ఫిబ్రవరి నుంచి ప్లాట్ ను వాస్తవంగా అప్పగించే వరకు రూ.49.50 లక్షలపై ఏటా 10.85% వడ్డీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్వీఎం ఆదిత్య హోమ్స్ అవసరమైన హెచ్ఎండిఏ అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేపట్టినందున రూ.27.16 లక్షలను వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. అరైన్ ఎమరాల్డ్ మియాపూర్ కొనుగోలుదారుడికి ప్లాట్ నెంబర్ 52 ను తక్షణమే అప్పగించాలని రేరా ఆదేశాలు జారీ చేసింది. బకాయిల పేరుతో డెవలపర్ డిమాండ్ చేసిన ఆరు లక్షలకు సేల్ అగ్రిమెంట్ లేదా రిజిస్టర్ సేల్ డీడ్ లో ఎలాంటి ఆధారం లేదని రేరా తిరస్కరించింది. బి.వి.ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ చెక్కులు జారీ చేసినప్పటికీ ప్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయకుండా విఫలమైనందుకు గాను ఏడు లక్షల రూపాయల వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. భువన్ తేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మధ్యలో వదిలేసినట్లు గుర్తించిన రేరా 26 లక్షల వడ్డీతో సహా కొనుగోలుదారుడుకి వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.

ఇటీవల సీరియస్ ఆదేశాలు…

ఇటీవల తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సీరియస్ గా ఉంది. చాలా దూకుడుగా ఉంటూ తీర్పులు ఇస్తోంది. అయితే తాజాగా 8 సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. అథారిటీ ఆదేశాలను పాటించడంలో ఏమాత్రం విఫలమైనా, ఏరా చట్టం 2016 లోని సెక్షన్ 63 కింద సదరు డెవలపర్లపై మరింత కఠిన చర్యలతో పాటు అదనపు జరిమానాలు విధిస్తారు. కొనుగోలుదారులు ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్రాజెక్టుకు రేరా రిజిస్ట్రేషన్, హెచ్ఎండిఏ లేదా సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు