Homeతెలంగాణసజ్జనార్ పై సీబీఐచే విచార‌ణ చేయండి...!బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్‌...

సజ్జనార్ పై సీబీఐచే విచార‌ణ చేయండి…!బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్‌…

  • సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సిపి స్థానం నుంచి బదిలీ అయ్యారు సజ్జనార్. ఆయనపై చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. కోపం పెంచుకున్నారు. వారిలో బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఒకరు. తాజాగా ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సజ్జనార్ హయాంలో జరిగినట్టు ఆరోపిస్తున్న వివిధ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. ఆయన కమిషనర్ గా ఉన్న సమయంలో కొన్ని కీలక కేసుల దర్యాప్తు ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టించారని.. ఆయన వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజాసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే సజ్జనార్ బదిలీ వెనుక కారణాలు ఇవి అంటూ అనేక రకాల అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ ఎమ్మెల్యే బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది.

ఆ కేసుల పురోగతిపై అనుమానం…

ప్రధానంగా హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన బంగారం దోపిడీ కేసుతోపాటు ఆమ్ వే కేసుల దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవడాన్ని రాజాసింగ్ ప్రశ్నించారు. ఆయా కేసుల్లో అసలైన నిందితుల అరెస్టులు ఎందుకు జరగలేదని.. దర్యాప్తు ఎంత నత్తనడక సాగడానికి వెనుక ఉన్న ఆలస్యపు కారణాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో సజ్జనార్ కర్ణాటకలోని తన స్వగ్రామం పరిసరాల్లో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు. ఇటీవల జనార్ధన్ అనే వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియా వేదికగా వెలువడిన పోస్టులను, పరిణామాల తరువాత సజ్జనార్ తీరుపై ప్రజల్లో మరిన్ని అనుమానాలు బలపడ్డాయని రాజాసింగ్ తన లేఖలో ప్రస్తావించారు.

కేంద్ర సంస్థల తో దర్యాప్తు…

అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే రాజాసింగ్ విరుచుకు పడడం సంచలనం గా మారింది. పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం సడలకుండా ఉండాలంటే.. ఉన్నత స్థాయి అధికారులపై వస్తున్న ఇలాంటి తీవ్రమైన ఆరోపణలను తేలికగా తీసుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాలపై రాష్ట్ర పరిధిలోని సంస్థలతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు