Homeక్రైమ్ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

క్రైమ్ మిర్రర్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

గిరిబాబు మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించి, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గిరిబాబు మరణం సినీ రంగానికి తీరని లోటుగా పలువురు పేర్కొంటున్నారు. ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
also read : ఘోర రోడ్డు ప్ర‌మాదం….! ఒక‌రు మృతి…20 మందికి గాయాలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు