-
కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో రూ.36 కోట్లతో పరిశ్రమ
-
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న భూమా మౌనిక
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి దంపతులు ఒక కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో వీరి ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న 31 వ సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026 తొలి రోజున ఈ దంపతులు స్థాపించిన స్టార్టాప్ నమస్తే వరల్డ్ ఎంవో యూ చేసుకుంది. పారిశ్రామికవేత్త హోదాలో, నమస్తే వరల్డ్ వ్యవస్థాపకురాలిగా పాల్గొన్న భూమా మౌనిక రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఎంతో అభివృద్ధితో ప్రారంభించారు ఈ సంస్థను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పిల్లల ఆట బొమ్మలు, హస్త కళా ఉత్పత్తులను రూపొందిస్తుంది ఈ సంస్థ. కేవలం స్వదేశీ కళాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు.
సదస్సు తొలిరోజులో…
విశాఖలో జరిగిన సిఐఐ తొలి రోజు సదస్సులో భాగంగా ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్త కళాకారులు, ఎన్నో కలలతో ముందుకు వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపై రావడం ఎంతో సంతోషాన్నిస్తోందని మౌనిక తెలిపారు. విశాఖపట్నం ఇంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆతిథ్యం ఇవ్వడం పై ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు జరుగుతున్న నిర్వహణ తీరును ప్రశంసించారు. ఈ మెగా ఈవెంట్ ను ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఏపీ ప్రభుత్వానికి, నిర్వహణ సంస్థలకు, మీడియాకు, సదస్సుకు తరలివచ్చిన ఇన్వెస్టర్లకు భూమా మౌనిక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహం తర్వాత వివాదం…
కొన్నేళ్ల కిందట మంచు మనోజ్ బాబును వివాహం చేసుకున్నారు భూమా మౌనిక. అనంతరం మోహన్ బాబు కుటుంబంలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ కుటుంబానికి మనోజ్ దూరమయ్యారు కూడా. అయితే క్రమేపి ఆ కుటుంబ వివాదాలు సమసిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఓవైపు మంచు మనోజ్ సినిమాల్లో రాణిస్తున్నారు. అదే సమయంలో భూమా మౌనిక రాజకీయ ప్రవేశం ఉంటుందని మనోజ్ ప్రకటించారు. ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. పర్యాటక సాంస్కృతిక రంగానికి సంబంధించిన వ్యాపారాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఏకంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు.
ఇవి కూడ చదవండి:
-
ఇటలీలో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘ఇడుపు కాయితం’.. ప్రియదర్శి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
-
రియల్ ఎస్టేట్లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
