నారాయణపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మక్తల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనిత (20) అనే డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలం వద్ద ఉన్న ఓ గుడిసెలో గురువారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, స్థానికంగా ఓ యువకుడి వేధింపుల కారణంగానే అనిత ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? విద్యార్థిని మృతికి దారితీసిన పరిస్థితులేమిటి? అనే విషయాలు ఇంకా స్పష్టతకు రాలేదు.
పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
also read: ఆమనగల్లులో ప్రీ-ప్రైమరీ టీచర్ నియామకాల్లో మెరిట్‌కు మంగళం..?
