బీహార్లో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. రోహతాస్ జిల్లా ససారామ్లో 18 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. తారాచండి నుంచి బేడాకు వెళ్లేందుకు యువతి ఓ ఆటోను ఆశ్రయించింది. అయితే ప్రయాణం మధ్యలో ఆటో డ్రైవర్, అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి ఆమెను జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఇద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించింది.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సందీప్ కుమార్, చిత్రంజన్ పాస్వాన్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ససారామ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
also read: ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!
