Homeక్రైమ్సమాధి తవ్వి యువతి తల, చేతుల అపహరణ! క్షుద్ర పూజల కోసమేనా?

సమాధి తవ్వి యువతి తల, చేతుల అపహరణ! క్షుద్ర పూజల కోసమేనా?

ఒడిశాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. మూఢనమ్మకాలు ఓ యువతి సమాధిని కూడా వదలని పరిస్థితికి దారితీశాయి. మరణించిన యువతి మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి, తలతో పాటు చేతులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా నర్సింగ్‌గుడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీలాద్రి మజ్జి (27) చికెన్ ఫాక్స్ వ్యాధితో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంప్రదాయ పద్ధతుల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు.

అయితే యువతి మరణించిన 42 రోజుల తర్వాత సమాధి వద్దకు వెళ్లిన స్థానికులకు విస్తుపోయే దృశ్యం కనిపించింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సమాధిని తవ్వి, మృతదేహం నుంచి తల, చేతులను తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ ఘటన వెనుక క్షుద్ర పూజల కోణం ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.

సమాధిని తవ్వి మృతదేహంలోని అవయవాలను అపహరించడానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. మూఢనమ్మకాల నేపథ్యంలో జరిగిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

also read: సురేఖ వాణి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్.. ప్రైవేట్ కంటెంట్‌పై నటి తీవ్ర హెచ్చరిక!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు