Homeఆంధ్ర ప్రదేశ్గుండెపోటుతో మ‌ర‌ణించిన ఎంపీటీసీ అభ్య‌ర్థి విజ‌యం...!

గుండెపోటుతో మ‌ర‌ణించిన ఎంపీటీసీ అభ్య‌ర్థి విజ‌యం…!

త‌ర్పుగోదావ‌రి, క్రైమ్‌మిర్ర‌ర్‌: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో గుండెపోటుతో మరణించిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (28) ఎన్నికల ఫలితాల్లో 350 ఓట్ల మెజారిటీతో విజయంసాధించారు. ప్ర‌జ‌ల‌కు సేవా చేయాల‌నే ఆశ‌యంతో ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన దివ్య శుక్రవారం పోలింగ్‌ రోజున దివ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. కూటమి తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివ్య.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా నేను ఉన్నానంటూ ప్ర‌చార స‌మ‌యంలో చురుగ్గా పాల్గొన్న దివ్య ఆక‌స్మ‌త్తుగా పోలింగ్ రోజున కుప్ప‌కూలిపోయింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆమె ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఫ‌లితం చూసుకోకుండానే మ‌ర‌ణించ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. బిడ్డా నువ్వు గెలిచావంటూ … మ‌ళ్లీ తిరిగి రా త‌ల్లీ అంటూ త‌ల్లిదండ్రులు రోదించిన తీరు ప‌లువురికి కంట‌త‌డి పెట్టించింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
  2.  దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
  3. అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
  4.  బంగ్లాదేశ్‌లో భారత వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. చెరువులో లభించిన మృతదేహం!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు