HomeUncategorizedఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవ‌ర్‌తో ప్రేమ పెళ్లి...! ఇప్పుడు ప‌క్కింటి కుర్రాడితో ఎఫైర్‌...చివ‌రికి ఏం జ‌రిగిదంటే...

ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవ‌ర్‌తో ప్రేమ పెళ్లి…! ఇప్పుడు ప‌క్కింటి కుర్రాడితో ఎఫైర్‌…చివ‌రికి ఏం జ‌రిగిదంటే…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఎఫైర్ లు, స‌హ‌జ‌నీవ‌నాలు చేస్తున్న వ్య‌క్తులు ఎంత‌టి దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారో నిత్యం ప‌త్రిక‌ల్లో చ‌దువుతూనే ఉన్నాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న దాంప‌త్య జీవితం సాఫీగా సాగుతున్న స‌మ‌యంలోనే అడ్డ‌దారులు తొక్కితే ఎంత‌టి దారుణాలు చోటు చేసుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా ప‌క్కింటి కుర్రాడితో వివాహిత ఎఫైర్ పెట్టుకొని చివ‌రికి ప్రియుడితో క‌లిసి రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. క‌ర్ణాట‌క‌లోని మండ్య నగర శివారులో శుక్రవారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సహనా (25) ఎనిమిదేళ్ల కిందట ఆటో డ్రైవర్‌ వీరేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. వీరు బెంగళూరులోని మదనాయకనహళ్లిలో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో పొరుగున ఉండే రాహుల్‌తో సహనాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం వీరేశ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీనిపై కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఇదే విషయంపై సోమవారం కూడా సహనా దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మండ్యా జిల్లాలోని గున్నాయకనహళ్లిలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సహనా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన విషయం తెలుసుకున్న రాహుల్ గురువారం అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి వీరేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

మండ్య శివారులోని ఇందువాల ప్రాంతం వీసీ ఫామ్ రైల్వే గేట్ సమీపంలో కదులుతున్న రైలులో నుంచి కిందపడి సహనా, రాహుల్ మృతిచెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను మిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మండ్య రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయినప్పటికీ మరణాలకు దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
  2.  దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
  3. అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
  4.  భారత టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ వీడ్కోలు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు