-
2028 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యం
-
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఖరారు
-
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు అభ్యర్థిని సైతం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పై ఫుల్ ఫోకస్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాదయాత్ర చేశారు. ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. 2028 ఎన్నికల లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ముంచుకొస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నికల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ. అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉండడంతో.. ఎంత మాత్రం ఉపేక్షించకూడదు అని.. మరింత దూకుడు పెంచాలని చూస్తోంది బిజెపి.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఖరారు…
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో రామ్ చందర్రావు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీసీ నేతలకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే వారి పేర్లను సేకరించింది. ఒక్కో స్థానం నుంచి నలుగురు పేర్లతో అధిష్టానానికి ఆశావహుల జాబితా పంపించారు. అందులో భాగంగా ఉత్తర తెలంగాణ పట్టభద్రుల స్థానం నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.
బీసీ నేతకు చాన్స్…
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. డాక్టర్ వన్నాల వెంకటరమణ తో పాటు రిటైర్డ్ ఉపాధ్యాయుడు భిక్షం గౌడ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బిక్షం గౌడ్ సైతం త్వరలో బిజెపిలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉంది. అందుకే ఆయనను మరోసారి బరిలోకి దింపితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ కు గట్టి అభ్యర్థి…
ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముందస్తుగా అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలోకి దించితే మంచి ఫలితం ఉంటుందని అంచనా వేస్తోంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ఇంకా ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించలేదు. అయితే ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న నియోజకవర్గాలను భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా చింతల రామచందర్రావు బిజెపి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. తనకు చివరి అవకాశం కల్పించాలని కోరుతూ వస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని చూస్తున్నట్లు సమాచారం. చాలామంది యువ నాయకులు అక్కడ పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో సూత్రప్రాయంగా బిజెపి హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడ చదవండి:
-
భాగ్యనగర ప్రయాణికులకు గుడ్ న్యూస్…! రూ. 325 తో రోజంతా అన్ లిమిటెడ్ ప్రయాణం…
-
23న మళ్లీ మున్సిపల్ పోరు…!
-
భాగ్యనగరంలో నీటి సంక్షోభం…!
-
ఢిల్లీలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు.. ఇద్దరు మృతి!
