-
భారీగా తగ్గనున్న మెట్రో, ఆర్టీసీ పాస్ లు
-
రెండు యాజమాన్యాల సంయుక్త నిర్ణయం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: భాగ్యనగర ప్రయాణికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నగర ప్రయాణికులకు మెట్రో రైలు, ఆర్టీసీ యాజమాన్యాలు సంయుక్తంగా తీపి కబురు అందించాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్ ధరలను భారీగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణికులపై అధిక భారం మోపుతున్న పాస్ ధరలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. ప్రజా రవాణా వ్యవస్థల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రోజువారి ఉమ్మడి పాస్ ధరను 400 రూపాయల నుంచి 325 రూపాయలకు తగ్గించాలని.. నెలవారి పాస్ ధరను 8500 నుంచి 4 వేల రూపాయలు లేదా 4,500 రూపాయలకు తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.
పూర్తయిన చర్చలు…
ఈ ఉమ్మడి పాస్ ధరల తగ్గింపు పై ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. మెట్రో రైలు తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య కీలక చర్చలు కూడా జరిగాయి. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, మెట్రో రైలు సలహాదారు ఎన్ వి ఎస్ రెడ్డి ఈ అంశంపై చర్చించి ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. తుది నిర్ణయం కోసం నేడో, రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తో వీరిద్దరూ సమావేశం కానున్నట్లు ఆర్టిసి వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ అనంతరం పాస్ ల కొత్త ధరలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
దీపావళి నుంచి అమలు…
ఈ కొత్త నిర్ణయం దీపావళి నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఒకే పాస్తో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించేందుకు గత నెలలో ప్రభుత్వం ఉమ్మడి పాస్ విధానాన్ని ప్రారంభించింది. ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించి.. మెట్రో ఆర్టీసీ సేవలను సమన్వయం చేయడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించాలన్నది ఈ విధానం వెనుక ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఉమ్మడి పాస్ ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, నిత్యం ప్రజా రవాణా పై ఆధారపడే మధ్యతరగతి ప్రయాణికులకు నెలవారి పాస్ ధర భారంగా మారింది. దీంతో వాటి ధరలను తగ్గించాలని ప్రజల నుంచి వచ్చాయి వినతులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పున పరిశీలించాలని ఆదేశించింది.
ఇవి కూడ చదవండి:
- దేశభక్తి సినిమాలో ఇలాంటి సాంగ్ అవసరమా? సల్మాన్ ఖాన్ పాటపై దుమారం
-
వరదలో చిక్కుకుపోయిన మహిళలను కాపాడిన సీఐ…! సోషల్ మీడియా వైరల్…
-
కేటీఆర్కు బండి సంజయ్ ఘాటు కౌంటర్
-
అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ సూపర్.. టెస్ట్ లోకి తీసుకోవాలి : గవాస్కార్
