-
డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఎస్ఈసి నోటిఫికేషన్
-
అందరి దృష్టి అనంతపురం కార్పొరేషన్ వైపే…
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మేయర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ ల ఎన్నిక పూర్తయింది. ఇక మిగిలింది డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్మన్ ఎంపిక మాత్రమే. అయితే ఈసారి గతం మాదిరిగా కాకుండా ఒకే వైస్ చైర్మన్ ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ మేయర్ తో పాటు వైస్ చైర్మన్ ల ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా విజయవాడలో అధికారికంగా విడుదల చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు మేయర్లు, చైర్ పర్సన్ లు ఓటు హక్కు వినియోగించుకుని ఈ పదవులను భర్తీ చేయనున్నారు. ఎస్ఇసి ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈనెల 18వ తేదీ లోపు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీచేయనున్నారు.
పరోక్ష పద్ధతిలో…
రాష్ట్రవ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు.. 13 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆయా స్థానిక సంస్థల సమావేశ మందిరాల్లో ఈ నెల 23న పరోక్ష పద్ధతిలో డిప్యూటీ మేయర్లతోపాటు వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఏదైనా అనివార్య కారణాలు, సాంకేతిక సమస్యల వల్ల 23న ఎన్నిక సాధ్యం కాకపోతే మరుసటి రోజు ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్లు, కమిషనర్లకు ఎస్ఈసి ఆదేశాలు జారీ చేసింది.
టిడిపికే డిప్యూటీ మేయర్…
అయితే ఇప్పుడు అనంతపురం కార్పొరేషన్ విషయంలో ప్రధాన చర్చ నడుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ గౌడ్ స్వల్ప తేడాతో గెలుపొందారు. అత్యధిక డివిజన్లలో మాత్రం ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆదిత్యాన్ని సాధించింది. మొత్తం 62 డివిజన్లకు గాను తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే ఏకంగా 30 డివిజన్లను సొంతం చేసుకుంది. మిత్రపక్షాలైన జనసేనకు ఆరు, బిజెపికి ఒక స్థానం వచ్చింది. కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండడం.. టిడిపికి సింహభాగం కార్పొరేటర్లు ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవి టిడిపి ఖాతాలో పడే అవకాశం ఉంది.
ఇవి కూడ చదవండి:
-
రాప్తాడు ఘటనపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
-
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు!
-
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం….! అప్రూవ్డ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్…
-
దేశభక్తి సినిమాలో ఇలాంటి సాంగ్ అవసరమా? సల్మాన్ ఖాన్ పాటపై దుమారం
