Homeతెలంగాణభాగ్యనగరంలో నీటి సంక్షోభం...!

భాగ్యనగరంలో నీటి సంక్షోభం…!

  • సమ్మెకు దిగిన ప్రైవేటు ట్యాంకర్ల అసోసియేషన్

  • వాటర్ మాఫియా పై హైడ్రా చర్యలే కారణం

  • ఒక్కసారిగా స్తంభించిన వాటర్ సరఫరా నెట్వర్క్

  • విలవిలలాడిపోతున్న అపార్ట్మెంట్ల ప్రజలు, ప్రైవేట్ హాస్టల్స్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైడ్రా కేవలం భూ ఆక్రమణలు, కబ్జాల నియంత్రణకే పరిమితం కాలేదు. వాటర్ మాఫియా పై సైతం ఉక్కు పాదం మోపుతోంది. అయితే అదే ఇప్పుడు ప్రజలకు పెను సమస్యగా మారింది. మాదాపూర్ లోని సున్నం చెరువు పరిసరాల్లో.. నివాసాల ముసుగులో గుడ్డు చప్పుడు కాకుండా వందల సంఖ్యలో వేసిన అక్రమ బోర్లను, పైప్ లైన్ నెట్వర్క్ ను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో హైదరాబాద్ బృందాలు జెసిబి లతో కూల్చివేస్తున్నాయి. మరి కొన్నింటిని సీజ్ చేశాయి. దీంతో తమ వ్యాపారానికి గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్ సమ్మెకు దిగింది. 36 గంటల పాటు సరఫరాను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది.

నగరంలో గందరగోళం…

భాగ్యనగరం వ్యాప్తంగా ప్రైవేట్ వాటర్ సరఫరా నెట్వర్క్ నిలిచిపోయింది. ట్యాంకర్ల యజమానులు ఆకస్మిక బంద్ పిలుపుతో నగరవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. నగర జనాభా అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో నీటిని అందించే శక్తి వాటర్ బోర్డుకు లేదు. మెజారిటీ గేటెడ్ కమ్యూనిటీలు, హై రైజ్ అపార్ట్మెంట్లు, హాస్టల్లు ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఉదయం నుంచి వందల సంఖ్యలో పరుగులు తీసే ట్యాంకర్లు ఒక్కరోజు రోడ్డు ఎక్కకపోవడంతో అలజడి మొదలైంది. రోజు నాలుగు ఐదు ట్యాంకర్లు అవసరమయ్యే భారీ అపార్ట్మెంట్లలో ఒక్క ట్యాంకర్ కూడా రాకపోవడంతో నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

హాస్టల్ విద్యార్థులకు దీపావళి సెలవులు…

నీటి సంక్షోభంతో భాగ్యనగరం ఒక్కసారిగా అల్లాడిపోయింది. ఈ సంక్షోభం అనేది కేవలం నివాస ప్రాంతాలకే పరిమితం కాకుండా విద్యాసంస్థలు, కార్పొరేట్ హాస్టళ్ల పైన పడింది. హాస్టల్లో కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులకు దీపావళి సెలవులు ఇచ్చి పంపించే సాయి. వాటర్ మాఫియా పై హైడ్రా తీసుకుంటున్న చట్టపరమైన చర్యలు సహేతుకమే అయినా.. ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేయకుండా ఉన్నఫలంగా బోర్లను నిలిపివేయడం సాధారణ పౌరులకు ఇబ్బందికరంగా మారింది. వాటర్ బోర్డు అధికారిక బుకింగ్స్ రోజురోజుకు పెరిగిపోతూ.. వెయిటింగ్ లిస్టులు మరింత పెరుగుతున్నాయి. ప్రజలు ప్రైవేట్ మాఫియాను ప్రాధేయ పడాల్సి వస్తోంది. చెరువులతో పాటు ప్రకృతి వనరులను కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న నియంత్రణ చర్యలు మంచివే. కానీ లక్షలాదిమంది ఆధారపడిన నగర తాగునీటి సరఫరా వ్యవస్థ కుప్పకూలకుండ.. యుద్ధ ప్రాతిపదిక నా మున్సిపల్ యంత్రాంగం రంగంలోకి దిగి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే భాగ్యనగరంలో నీటి సంక్షోభం మరింత ముదరడం ఖాయం.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  హరియాణా పాఠశాల ఘటన.. ఆరేళ్ల బాలికపై దాడి చేసిన ఎనిమిదేళ్ల బాలుడికి బెయిల్!
  2. తెలుగు సినిమా పరిశ్రమను గౌరవించాలి.. కొందరు తారల తీరుపై నిర్మాత SKN ఘాటు వ్యాఖ్యలు!
  3. చిన్న శ్రీను కు షాక్…!
  4. రాప్తాడు ఘటనపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు