-
అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన హైదరాబాద్ యువతి
-
అతి చిన్న వయసులోనే సెనేటర్ గా నబిలా సయ్యద్
-
సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఘనవిజయం సాధించింది. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ లోని ఉభయ సభలతో పాటు పలు కీలక రాష్ట్రాల గవర్నర్ పదవులను డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారు. ఇంకోవైపు అమెరికాలో ఇల్లినాయిస్ స్టేట్ సెనేట్ లో హైదరాబాద్ యువతి ఘన విజయం సాధించింది. హైదరాబాద్ మూలాలు ఉన్న 27 ఏళ్ల యువతి నబీలా సయ్యద్ గెలుపొందింది. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ప్రత్యర్థి, రిపబ్లిక్ అండ్ పార్టీ అభ్యర్థి బార్బీ హిల్స్‌ను ఓడించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్.
హైదరాబాద్ మూలాలు…
హైదరాబాద్ మూలాలు ఉన్న నబిలా తల్లిదండ్రులు 1980లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. నబీలా సయ్యద్ అమెరికాలోనే పుట్టారు. 2022లో తొలిసారిగా ఇల్లినాయిస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గా విజయం సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కాలేజీ విద్యను పూర్తి చేసిన ఆమె.. తరువాత రాజకీయ అరంగేట్రం చేశారు. అతి చిన్న వయసులోనే ఇళ్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన యువతిగా రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఏకంగా స్టేట్ సెనేట్ గా భారీ విజయం సొంతం చేసుకున్నారు.
సంచలన ఇంటర్వ్యూ…
మొన్న ఆ మధ్యన ఆమె సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించినప్పుడు తాను క్లాస్ రూమ్ లో కూర్చుని ఏడ్చానని ఎన్బిసి మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మాలాంటి వాళ్లకు ఈ దేశంలో చోటు లేదు అనుకున్నానని.. నేను ఈ ప్రాంతానికి చెందిన దానినా.. అన్న అనుమానం కలిగేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆవేదన నుంచి ఆమెలో కసి పెరిగింది. స్టేట్ సెనేట్ కు ఆమె ఎంపిక కావడం మాత్రం నిజంగా గొప్ప పరిణామం అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. అగ్రరాజ్యంలో హైదరాబాద్ మూలాలు ఉన్న ఓ యువతి విజయం సాధించడం.. దేశానికి గర్వ కారణం అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
-
బీజేపీ నేత కుమారుడు మృతి.. భార్యపై సంచలన ఆరోపణలు!
-
ఎంపీడీఓపై మూకుమ్మడి సెలవుల రాజకీయం…!
-
కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. నాలుగు మృతదేహాలు గుర్తింపు!
-
ఒలింపిక్ స్వర్ణ పతకాన్నీ వదల్లేదు.. హాకీ దిగ్గజం ఇంట్లో భారీ చోరీ!
