Homeతెలంగాణరెస్టారెంట్ల లైసెన్సులు రద్దు...! భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు...

రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు…! భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు…

  • కళ్ళు బైర్లు కమ్మేలా అక్కడ పరిస్థితులు

  • చర్యలకు తక్షణం ఉపక్రమణ

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: బిర్యానీలకు పెట్టింది పేరు భాగ్యనగరం. జాతీయస్థాయిలో సైతం ఇక్కడ బిర్యానీకి ఇష్టపడని వారు ఉండరు. ఇక చాయ్ తో పాటు రుచికరమైన వంటకాలు ఇక్కడ ప్రత్యేకమే. అందుకే నిత్యం వేలాదిమంది క్యూ కడుతుంటారు. భాగ్యనగరంలో రోజురోజుకు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు విస్తరిస్తున్నాయి. అయితే నగరంలో పేరు మోసిన హోటళ్ల అసలు బంగారం ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడుల్లో వెలుగు చూసింది. తెలంగాణ సేఫ్ విభాగం ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 22 ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు గోల్కొండ, చార్మినార్ జోన్లలో ఏకకాలంలో భారీగా తనిఖీలు చేశారు. ఈ ఆపరేషన్ లో నగరంలో అత్యంత పేరుగాంచిన షా గౌస్, హోటల్ నయాబ్, మెహఫిల్, సహాయం వంటి రెస్టారెంట్ల వంట గదుల్లో కనిపించిన దృశ్యాలు అధికారులను నివ్వెరపరిచాయి.

ప్రజారోగ్యానికి భంగం…

ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి తీవ్రమైన అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మొత్తం 14 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. వాటి కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల సందర్భంగా ప్రముఖ హోటళ్ల వంట గదుల్లో వెలుగు చూసిన పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. కుల్లి పోయిన కూరగాయలు, ఫంగస్ పట్టిన ఆహార పదార్థాలు, ఎక్స్పైరీ అయిన సరుకులను యదేచ్చగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పచ్చి మాంసాన్ని, శాఖాహార వంటకాలను నిబంధనలకు విరుద్ధంగా ఒకే చోట నిల్వ ఉంచడం.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ మళ్ళీ మరిగిస్తూ వంటలు చేస్తుండడం బయటపడింది.

ఎలుక రెట్టలు, బొద్దింకలు…

కొన్ని హోటల్లో అయితే వంట గదుల్లో ఎలుక రెట్టలు, బొద్దింకలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని చోట్ల కిచెన్లలో పిల్లులు తిరుగుతున్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నారు. మురుగునీటి నిల్వలు, గ్రీజుతో పేరుకుపోయిన చిమ్నీలు, చితికిపోయిన ఫ్లోరింగ్ నడుమ.. సిబ్బంది కనీసం ఆప్రాన్లు, హెయిర్ నెట్స్ కూడా ధరించకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నారు.

లైసెన్సు రద్దు ఈ రెస్టారెంట్లకి…

భాగ్యనగరంలో మొత్తం 14 హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులు రద్దయ్యాయి. శాలిబండలోని షా గౌస్ కేఫ్, నయా ఫుల్ హోటల్ నయాబ్, సంతోష్ నగర్ లక్కీ రెస్టారెంట్, దిల్షుక్నగర్ మెహిఫిల్, మలక్పేట్ సోహైల్ రెస్టారెంట్, టోలిచౌకి, శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ హోటళ్లు, గుడిమల్కాపూర్ లోని శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా, సిద్ధిక్ కబాబ్ సెంట్రల్ కిచెన్, టోలిచౌకి ఆల్సబ, మాసబ్ ట్యాంక్ డైన్ హిల్, ఎం జె ఆర్ రోడ్డు లోని అక్షయ టిఫిన్స్, వెంకటేశ్వర హోటల్, రేతి బౌలీలోని ఆ జీవో రాయల్ అరేబియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ తక్షణమే తమ కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు తేల్చి చెప్పారు. నోటీసులు కూడా జారీ చేశారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  నీతా అంబానీ ఉదారత: ముంబైలో 100 ఎకరాల్లో ‘అనంత ఆశ్రయ్’ ప్రాజెక్ట్ ప్రారంభం!
  2.  ఆర్థిక భద్రతకు పొదుపే మార్గం: ఈఎంఐల భారం తగ్గించుకోవాలని నిపుణుల సూచన!
  3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత
  4. 28 ఏళ్ల క్రితం హత్య చేసి పరారీ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు