Homeఆంధ్ర ప్రదేశ్నెత్తుటి సంస్కృతి...! పాఠశాల ప్రాంగణంలోకి క్రూరత్వం..

నెత్తుటి సంస్కృతి…! పాఠశాల ప్రాంగణంలోకి క్రూరత్వం..

  • ఈ పాపం ఎవరిది?

  • కూకటి వేళ్ళతో పెకిలించాల్సిందే

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: సమాజంలో ఉన్మాదం పెరిగిపోతోంది. దానిని నియంత్రించాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రత, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురంలో పదో తరగతి చదువుతున్న ఒక బాలికపై ఎలక్ట్రిక్ రంపముతో జరిగిన రాక్షస దాడి.. కేవలం వ్యక్తిగత నేరం మాత్రమే కాదు. అది సమాజం మానసికంగా ఎంతటి పతన అవస్థకు చేరిందో చాటిచెప్పిన భయంకర వాస్తవం. పైశాచికత్వాన్ని చూసి నివ్వెర పోయిన ప్రతి గుండెలో రగిలిన ఆగ్రహం ఇప్పుడు ఆ నేరస్తుడు పైనే కాదు.. నిత్యం విచ్చలవిడి రక్తపాతాన్ని.. వికృత హింసను మాస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో విక్రయిస్తున్న వ్యవస్థలపై కూడా వేలెత్తి చూపుతోంది. వెండితెరపై మారణాయుధాలతో నరుక్కుంటూ పోతున్న దృశ్యాలను, ఎలక్ట్రిక్ రంపాలు, గొడ్డళ్లతో రక్తపుటేరులు పారించే వికృత పోకడలను నిస్సిగ్గుగా ఆమోదిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఈ నెత్తుటి సంస్కృతి విస్తరణలో తన నైతిక బాధ్యత నుంచి ఎంత మాత్రం తప్పించుకోలేదు. కళా స్వేచ్ఛ ముసుగులో వికృత హింసను.. నిరభ్యంతరంగా సమాజంలో వదిలేస్తున్న సెన్సార్ బోర్డు నిద్రమత్తు వల్లే.. తెరపై చూపిన క్రూరత్వం నేడు పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించింది.

ఆ చిత్రాలకు సెన్సార్ బ్రేక్…

వికృత రక్తపాతాన్ని, మహిళలపై జరిగే వేధింపులను హీరోయిజంగా చూపించే చిత్రాలకు బ్రహ్మరథం పడుతూ.. వందల కోట్ల కలెక్షన్లను కురిపిస్తున్న బాధ్యతారాహిత్యం ముమ్మాటికి సమాజానిదే. ఏ సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత పెద్ద హిట్ అనే భావన సృష్టించి.. ఆ హింసను ఆరాధించే మానసిక స్థితిని మనమే ప్రోత్సహించాం. బాక్సాఫీస్ రికార్డుల పేరుతో నరరూప రాక్షసత్వాన్ని కొనియాడే ధోరణి యువత మనసుల్లోకి ఎలాంటి విషాన్ని ఎక్కిస్తుందో గ్రహించలేకపోతున్నాం. నేడు సమాజంలో చొరబడిన ఆ పైశాచిక విషమే చివరకు ఒక అభం శుభం తెలియని బాలిక రక్తాన్ని నిలువునా పారించేలా చేసిందన్న చేదు నిజాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే.

కన్నవారిలో ఆందోళన…

ఇటువంటి దుశ్చర్య అనంతపురంలోని ఒక్క కుటుంబానికో.. ఆ పాఠశాలకు మాత్రమే పరిమితం కాదు. ఈ దారుణం గురించి విన్న, చదివిన రాష్ట్రంలోని ప్రతి తల్లిదండ్రి, ప్రతి కుటుంబం గుండెల్లో ఒక తీరని బయోత్పాతాన్ని నింపింది. తమ బిడ్డలు బడికి వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారా అన్న భరోసా అదృశ్యం అవుతుంది. ఎదిగే ఆడపిల్లలను సమాజంలోకి పంపడానికి తల్లిదండ్రులు క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమంటు బతకాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. మహిళల రక్షణ కోసం రూపొందించిన కాగితపు చట్టాలు, రక్షణ నినాదాలు ఈ వికృత రాక్షసత్వం ముందు ఎంత నిస్సహాయంగా నిలబడిపోయాయో చూసి సాధారణ ప్రజానీకం దిగ్భ్రాంతికి గురవుతోంది. ఇక ఈ దృశ్యాన్ని కల్లారా చూసిన పాఠశాల విద్యార్థుల మానసిక పరిస్థితిని ఊహించడానికి గుండె తరుక్కుపోతుంది. తమతో పాటు క్లాస్ రూమ్ లో కూర్చున్న తోటి స్నేహితురాలు రక్తపు మడుగులో విలవిలలాడుతుంటే చూసిన ఆ పసి మనసులు తీవ్రమైన మానసిక గాయం నుంచి.. జీవితంలో తేలికగా కోలుకోగలరా?

తిరుగుబాటు చేయాలి…

ఇలాంటి ఘటనలు, దారుణాలు పునరావృతం కాకూడదంటే.. కేవలం ప్రకటనలు, నామమాత్రపు చర్యలు సరిపోవు. హింసను సినిమాటిక్ బ్రిలియన్స్ అని పిలిచే విష సంస్కృతి పై, రక్తపాతాన్ని ఆస్వాదించే పైశాచిక సమాజపు పోకడలపై సామూహిక తిరుగుబాటు రావాలి. సెన్సార్ బోర్డు నిబంధనలను సమూలంగా మార్చి.. వికృత హింసను గ్లామరైజ్ చేసే కంటెంట్ పై ఉక్కు పాదం మోపాలి. అదే సమయంలో కేవలం సినిమాలపైనే కాకుండా సమాజంలో నైతిక విలువల పెంపు, ఆడబిడ్డలకు భద్రత కల్పించే వ్యవస్థాగత రక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు మరో చిక్కు.. సిద్దిపేటలో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు
  2.  రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు?
  3. అచ్చంపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
  4.  ఏపీకి మరో తుపాను ముప్పు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఢిల్లీ పర్యటన రద్దు…

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు