Homeసినిమాప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత.. బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడి మృతి!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత.. బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడి మృతి!

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌రైటర్‌ సంజయ్‌ గుప్తా కన్నుమూశారు. బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ వార్తతో హిందీ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంజయ్‌ గుప్తా. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలను రూపొందించారు. ముఖ్యంగా ‘కాంటే’, ‘ముసాఫిర్‌’, ‘షూటౌట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా’, ‘షూటౌట్‌ ఎట్‌ వడాలా’ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

అంతేకాకుండా ‘జజ్బా’, ‘కాబిల్‌’ వంటి చిత్రాలతోనూ తన ప్రతిభను చాటుకున్నారు. వైట్‌ ఫెదర్‌ ఫిల్మ్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సినీ రంగానికి సేవలందించారు.

సంజయ్‌ గుప్తా మరణవార్తతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

also read: ఆ(భా)స్కర్ లెవెల్ నటన…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు