క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ధరించే ’45’ జెర్సీ నెంబర్ వెనుక ఒక ఆసక్తికరమైన మరియు మధురమైన కథ దాగి ఉంది. రోహిత్ శర్మ తన క్రికెట్ ప్రయాణంలో ఈ నెంబర్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం తన తల్లి అని గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.క్రికెట్‌లో నెంబర్ ‘9’ తనకు ఎంతో అదృష్టమని, ఆ నెంబర్‌ను తీసుకోవాలని రోహిత్ తల్లి సూచించారట. అయితే, అప్పటికే ఆ జెర్సీ నెంబర్‌ను వేరే ఆటగాడు తీసుకోవడంతో రోహిత్ ఆ నెంబర్‌ను పొందలేకపోయారు. మరోవైపు తనకు నెంబర్ ’27’ తో ఆడటం కూడా ఇష్టం లేకపోవడంతో వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించారు.
శివాజీగా రిషబ్ శెట్టి: రెండు భాగాలుగా తెరకెక్కనున్న ‘ఛత్రపతి శివాజీ’ బయోపిక్!
అప్పుడు 2 మరియు 7 పక్కపక్కనే ఉండే ’45’ నెంబర్‌ను తీసుకుంటానని, ఆ రెండు సంఖ్యలను కలిపితే (4+5) మళ్లీ ‘9’ అనే అదృష్ట సంఖ్యే వస్తుందని రోహిత్ తన తల్లికి వివరించారట. కొడుకు చెప్పిన ఈ లాజిక్‌కు ఆమె కూడా సంతోషంగా సరేనని అంగీకరించడంతో, అప్పటి నుంచి రోహిత్ శర్మ ’45’ నెంబర్ జెర్సీతోనే మైదానంలో అడుగుపెడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ విధంగా సెంటిమెంట్ మరియు ఆలోచనల కలయికతో ఏర్పడిన ఈ నెంబర్ నేడు రోహిత్ బ్రాండ్‌గా మారిపోయింది.
భారతైక్యతా శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఉక్కు మనిషికి ఘన నివాళి!
