1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, వందలాది సంస్థానాలు వేర్వేరుగా ఉండి దేశ ఐక్యతకు పెద్ద సవాలుగా మారాయి. అటువంటి కీలక సమయంలో రంగంలోకి దిగిన ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో దౌత్యనీతితో, రక్తం చిందించకుండా రాజులను ఒప్పించి సంస్థానాల విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.ముఖ్యంగా 1948లో చేపట్టిన చారిత్రాత్మక ‘ఆపరేషన్ పోలో’ ద్వారా హైదరాబాద్‌లో నవాబుల నైజాం పాలనకు ముగింపు పలికి, సంస్థానాన్ని భారత యూనియన్‌లో చేర్చారు. ఇలా చెల్లాచెదురుగా ఉన్న దేశాన్ని సమైక్య భారత్‌గా తీర్చిదిద్దడంలో పటేల్ చూపిన చొరవ అసామాన్యం.
శివాజీగా రిషబ్ శెట్టి: రెండు భాగాలుగా తెరకెక్కనున్న ‘ఛత్రపతి శివాజీ’ బయోపిక్!
ఆయన నిరుపమాన సేవలకు గురుతుగా గుజరాత్‌లోని నర్మదా నదీ తీరాన అత్యంత భారీగా ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని నిర్మించారు. దేశ సమగ్రతకు ప్రాణం పోసిన ఈ మహోన్నత నాయకుడి 151వ జయంతి సందర్భంగా నవభారతం ఆయన సేవలను సస్మరణీయంగా గుర్తుచేసుకుంటోంది.
