ముంబై,క్రైమ్‌మిర్రర్: భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. కాగా వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌కు పూర్తి స్థాయి బ్యటింగ్ కోచ్‌గా సేవలందించనున్నారు. ఇక బౌలింగ్ కోచ్‌గా మిచెట్ మెక్‌క్లెనాగన్‌ను తీసుకున్నారు. టీ దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ డెవలప్మెంట్ కోచ్‌గా ధావల్ కులకర్ణిని నియమించారు. ఇటీవలే ఆ జట్టు ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్‌ను నియమించిన విషయం తెలిసిందే.
కాగా గతంలో ఊతప్ప, మెక్‌క్లెనాగన్ ముంబై తరపున ఆడారు. కివీస్ బౌలర్ అయిన మెక్‌క్లెనాగన్ ముంబై తరపున 56 మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు తీసుకున్నాడు. 2015, 2019 టైటిల్స్ గెలిచిన ముంబై బృందంలో అతను ఉన్నాడు. ముంబై తరపున ఆడిన ఒకే సీజన్‌లో ఊతప్ప 14 మ్యాచుల్లో 320 రన్స్ చేశాడు. కోల్‌కతా, చెన్నై జట్ల తరపున కూడా ఊతప్ప ఆడాడు. అతను మొత్తం 205 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, వాటిల్లో 4952 రన్స్ స్కోరు చేశాడు.
ఇవి కూడ చదవండి:
-
అమెరికా-రష్యా కీలక ఒప్పందాలు…?
-
పిల్లల కళ్లెదుటే భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త.. ఆపై పెద్ద కుమారుడితో పరారీ!
-
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి
-
ఢిల్లీలో దారుణం.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై కత్తితో దాడి!
