Homeతెలంగాణకేటీఆర్ కు స్వల్ప ఊరట...!

కేటీఆర్ కు స్వల్ప ఊరట…!

  • పాస్పోర్ట్ సీజ్ పై హైకోర్టు కీలక ఆదేశం

  • యథాస్థితిని కొనసాగించాలని సూచన

క్రైమ్ మిర్రర్,, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాస్పోర్ట్ వ్యవహారంలో స్వల్ప ఉపశమనం. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన క్రిమినల్ కేసు వివరాలను హైదరాబాదులోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని అవినీతి నిరోధక శాఖను హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ రాసిన లేఖ ఆధారంగా పాస్పోర్ట్ అధికారులు తనకు జారీచేసిన సోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ప్రక్రియపై యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

బలమైన వాదనలు…

ఈ కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ బలమైన వాదనలు వినిపించారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ దాఖలు చేసి న్యాయస్థానం పరిధిలోకి వచ్చిన తర్వాత.. నిందితుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే అధికారం కేవలం క్రిమినల్ కోర్టుకే ఉంటుందని స్పష్టం చేశారు. కోర్టు నిర్ణయించిన అంశాన్ని దర్యాప్తు సంస్థ సమాచారం ఆధారంగా పాస్పోర్ట్ అధికారులు నేరుగా చేపట్టడం చట్ట విరుద్ధమని.. విదేశీ ప్రయాణ హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ లో భాగమని వాదించారు. అంతేకాకుండా ఆర్పిఓ కు ఏసీబీ అందించిన పత్రాల వివరాలను తమకు ఇవ్వలేదని.. అందువల్ల సరైన వివరణ ఇచ్చే హక్కును కోల్పోతున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు.

కేసు విచారణ వాయిదా…

ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపించారు. కేటీఆర్ పాస్పోర్టును ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేదని.. కేవలం ఎందుకు చర్యలు తీసుకోకూడదు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు మాత్రమే జారీ చేసినట్లు స్పష్టం చేశారు. సంబంధిత అధికారి ముందు హాజరై వివరణ ఇచ్చే పూర్తి స్వేచ్ఛ పిటిషనర్కు ఉందని తెలిపారు. ఈ క్రమంలో ట్రయల్ కోర్టులో పాస్పోర్టు సీజ్ చేయాలంటూ ఏసీబీ ఏమైనా మెమో దాఖలు చేసిందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే చట్ట నిబంధనల ప్రకారమే కేసు వివరాలను పాస్పోర్ట్ అధికారులకు తెలియజేశామని ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ సమాధానం ఇచ్చారు. దర్యాప్తు సంస్థల పరిధి, క్రిమినల్ కోర్టుల అధికారాలు, పాస్పోర్ట్ అధికారుల నిబంధనల మధ్య ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ అంశంపై సమగ్ర కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఏసీబీ ని ఆదేశించింది. విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రస్తుత పరిస్థితిని యధాతధంగా ఉంచాలని ఆదేశించింది. కేటీఆర్ కు ఇది ఊరట నిచ్చే అంశం.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  కొచ్చిలో నేడు WPL ఆటగాళ్ల వేలం: స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటీ!
  2. శబరిమల ‘మకరవిళక్కు’ యాత్ర: రేపు ఉదయం 10 గంటల నుంచి వర్చువల్ క్యూ టికెట్ల బుకింగ్స్ షురూ!
  3. బెంగళూరులో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త మృతి.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
  4. ‘గ్రేటర్’ ఎవరిదో…? విశాఖ మేయర్ పీఠం ప్రతిష్టాత్మకం…

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు