Homeక్రీడలుశిష్యుడిపై యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు..!

శిష్యుడిపై యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు..!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన శిష్యుడు, యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను యువీ కొనియాడారు.

కొచ్చిలో నేడు WPL ఆటగాళ్ల వేలం: స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటీ!

ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అభిషేక్.. ఇప్పటికీ నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేకపోయావు. అయితే నేను కూడా 30 లేదా 34 బంతుల్లో సెంచరీ చేయలేకపోయాను. చాలా బాగా ఆడావు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు తమ పెరట్లో ఆడుతున్నట్లు అనిపించింది” అంటూ యువీ చేసిన ట్వీట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.కాగా, 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే రికార్డును ఉద్దేశించి యువీ తన శిష్యుడితో సరదాగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

శబరిమల ‘మకరవిళక్కు’ యాత్ర: రేపు ఉదయం 10 గంటల నుంచి వర్చువల్ క్యూ టికెట్ల బుకింగ్స్ షురూ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు