క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ఇవాళ కొచ్చి వేదికగా ఘనంగా జరగనుంది. మొత్తం 27 పొజిషన్ల భర్తీ కోసం 146 మంది ప్లేయర్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఫ్రాంచైజీల వద్ద ఉన్న బడ్జెట్ విషయానికి వస్తే, అత్యధికంగా UP వారియర్స్ వద్ద రూ.3.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, RCB రూ.1.15 కోట్లతో 5 వేకెన్సీలను, MI రూ.90 లక్షలతో 6 వేకెన్సీలను భర్తీ చేసుకోవాల్సి ఉంది.
శబరిమల ‘మకరవిళక్కు’ యాత్ర: రేపు ఉదయం 10 గంటల నుంచి వర్చువల్ క్యూ టికెట్ల బుకింగ్స్ షురూ!
ఈ వేలంలో సోఫీ మోలినార్క్స్, సోఫియా డంక్లీ, ఆటపట్టు, జోనసెన్, హెథర్, గ్రేస్ హ్యారిస్, కమలిని, స్నేహ్ రాణా వంటి పలువురు స్టార్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న WPL టోర్నమెంట్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది.
మంచి పాత్రలొస్తే తప్పకుండా నటిస్తా’.. రూట్ మార్చిన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి!
