టాలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మరో కొత్త బాధ్యతను చేపట్టబోతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై హీరోగా అలరించిన ఆయన.. తొలిసారి హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’కు తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘ది ట్రెయిటర్స్’ రియాలిటీ షో ఫార్మాట్‌ను తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ షోకు సంబంధించిన ట్రైలర్‌ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. ‘మోసం ఇక్కడ కొత్త రూల్’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ కార్యక్రమం.. అబద్ధాలు, అనుమానాలు, వ్యూహాలు, మైండ్ గేమ్స్ చుట్టూ సాగనుంది.
ఈ రియాలిటీ షోలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 20 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు నటులు హర్షవర్ధన్, ప్రగతి, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యుల్లత రామన్, విష్ణు ఓయ్, సాయి రోనక్ తదితరులు ఇందులో కనిపించనున్నారు.
షో హోస్ట్‌గా తన కొత్త ప్రయాణంపై తేజ సజ్జా ఆసక్తికరంగా స్పందించారు. ఇప్పటివరకు తాను చేసిన పనులతో పోలిస్తే హోస్టింగ్ పూర్తిగా కొత్త అనుభవమని, అందుకే ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.
ఈ గేమ్‌లో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనేది చివరి వరకు అర్థం కాని విధంగా పరిస్థితులు మారుతుంటాయని తేజ సజ్జా పేర్కొన్నారు. కంటెస్టెంట్స్ మధ్య జరిగే మైండ్ గేమ్స్, అప్రత్యక్షమైన పొత్తులు, వ్యూహాలు షోను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయని చెప్పారు.
మొత్తంగా నమ్మకం, మోసం, వ్యూహాలు, నమ్మకద్రోహం చుట్టూ సాగే ఈ సైకలాజికల్ రియాలిటీ గేమ్ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా కనిపిస్తోంది. మరి హీరోగా ఆకట్టుకున్న తేజ సజ్జా.. హోస్ట్‌గా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ త్వరలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
also read: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి, కారోబార్
