క్రైమ్ మిర్రర్ : గుజరాత్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భావ్నగర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు.
also read : 67 రోజుల జైలు జీవితం తర్వాత ఊరట.. ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
