మెదక్, క్రైమ్‌మిర్రర్: సోమవారం అర్థారాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చిల్వర్ గ్రామ సమీపంలోని 161 జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికుల కథనం ప్రకారం టేక్మాల్ మండలం బోడ్‌మెట్‌పల్లి గ్రామానికి చెందిన కొడపాక నాగరాజు (35) సోమవారం రాత్రి చిల్వర్కు వెళ్లి తిరిగి ఇంటికి కాలినడకన వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
దీంతో నాగరాజు శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
- విద్యార్థినుల మధ్య ఘర్షణ.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
-
సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బేటి…! స్థానిక ఎన్నికలపై చర్చ…
-
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకు దసరా సెలవులు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!
-
గొప్పల కోసం అప్పుల పాలు కావొద్దు: విజయ్ దేవరకొండ
